Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేటి నుంచి దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. సెంచూరియన్‌ వేదికగా ఈ రోజు భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
  2. హైదరాబాద్‌ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది.
  3. సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం నేడు జరుగనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మల్లన్న కల్యాణాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కొమురవెల్లిలో మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మల్లన్న కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి మంత్రి హరీష్‌రావు హజరుకానున్నారు. ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
  4. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. గత మూడు రోజులగా ఏపీలో పర్యటిస్తున్న సీజేఐ ఈ రోజు విజయవాడలోని బార్‌ అసోసియేషన్‌ నిర్వహించే సన్మాన వేడుకకు హజరుకానున్నారు.
  5. నేడు ప్ర‌ధాని మోడీ మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మం జరుగనుంది. మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మం ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు జరుగుతుంది.
Exit mobile version