ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్‌ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ఆయన రాజీనామాను ఆమోదించి.. ఉప ఎన్నికలకు తెరతీసింది అధికార పార్టీ. హుజురాబాద్‌లో ఎంతమంది ఓటర్లు వున్నారు? ఎవరెవరు ఎవరికి ఓటేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం జనాభాసంఖ్య : 2,89,213
అందులో పురుషులు : 1,43,623 మరియు మహిళలు : 1,45,590
హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం ఓటర్లు : 2,33,103
అందులో పురుషులు : 1,16,537 మరియు స్త్రీలు : 1,20,563
హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.
- హుజురాబాద్ ( అర్బన్, రూరల్ )
- జమ్మికుంట (అర్బన్, రూరల్ )
- కమలాపూర్,
- వీణవంక
హుజురాబాద్ నియోజగవర్గంలో గత 6 ఎన్నికలలోనూ వరుసగా టీఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటల గత 4 ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీ నుండి గెలిచారు. ఇప్పటివరకు బీజేపీ 2018 లో జరిగిన ఎన్నికలలో పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఆ ఎన్నికలలో నోటాకి 2867 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు నోటా కంటే తక్కువ ఓట్లు. మరి ఈసారి ఈటల బీజేపీ తరఫున అసెంబ్లీలో అడుగు పెడతారా? మళ్ళీ హుజురాబాద్‌లో గులాబీ జెండాయే గెలుస్తుందా? ఓటర్ల మదిలో ఏముంది?
