NTV Telugu Site icon

విశాఖ‌లో కుంగిన భూమి… ఆందోళ‌న‌లో ప్ర‌జలు…

విశాఖ వాసుల‌కు జవాద్ తుఫాన్ ముప్పు త‌ప్పింద‌ని అనుకునేలోగా మ‌రో ముప్పు వ‌చ్చిప‌డింది.  విశాఖ‌లోని ఆర్కే బీచ్‌లోని స‌ముద్రం ఉన్న‌ట్టుండి ముందుకు వ‌చ్చింది.  స‌ముద్రం ముందుకు రావ‌డంతో భూమి కోత‌కు గురైంది.  చిల్ట్ర‌న్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది.  దీంతో పార్క్‌లోని బ‌ల్ల‌లు ఒరిగిపోగా, ప్ర‌హ‌రీగోడ కూలిపోయింది.  అటు పార్క్ బ‌య‌ట ప‌ది అడుగుల మేర భూమి కుంగిపోయి క‌నిపించింది.  దీంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.  బీచ్‌లో ఏం జ‌రుగుతుందో తెలియ‌క వ‌ణికిపోతున్నారు.  

Read: న్యూయార్క్‌ను భ‌య‌పెడుతున్న ఒమిక్రాన్‌…

చిల్డ్ర‌న్ పార్క్ వైపు ప్ర‌జ‌ల‌ను వెళ్ల‌నివ్వుకుండా భారీకేడ్లు అడ్డుపెట్టారు.  ఆర్కే బీచ్ నుంచి దుర్గాల‌మ్మ గుడి వ‌ర‌కు 200 మీట‌ర్ల మేర భూమి కోత‌కు గురైంది.  విశాఖ‌కు జ‌వాద్ ముప్పు తప్పింద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ స‌ముద్రం ముందుకు రావ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.