NTV Telugu Site icon

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజేపీ ‘RRR’

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ మూవీ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ‘RRR’ కాకుండా బీజేపీ ‘RRR’కు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్, గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావు మాత్రమే కమలం పార్టీకి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.

Read Also: శత్రువుకు శత్రువు మిత్రుడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ తరఫున మూడో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు ‘RRR’ అంటూ ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. దీంతో గతంలో బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ వారు ఆ ఫోటోకు క్యాప్షన్ పెడుతున్నారు.