Site icon NTV Telugu

దీపావ‌ళి పండుగ పేరే కాదు.. ఆ గ్రామం పేరు కూడా…

దీపావ‌ళి పండుగ వ‌చ్చింది దేశంలోని అన్ని ప్రాంతాల్లో ట‌పాసులు కాలుస్తూ సంబ‌రాలు చేసుకుంటారు.  న‌ర‌కాసుడిని వ‌ధించిన రోజు కావ‌డంతో ఈ పండుగ‌కు దీపావ‌ళి అని పేరు వ‌చ్చింది.  దీపావ‌ళి విశిష్ట‌త గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు.  అయితే, దీపావ‌ళి అన్న‌ది మ‌న‌కు తెలిసి పండుగ పేరు.  కానీ, ఆ గ్రామ‌స్తుల‌కు మాత్రం అది పండుగ‌తో పాటుగా ఆ గ్రామం పేరు కూడా.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండ‌లంలో ఓ గ్రామం ఉన్న‌ది.  ఆ గ్రామం పేరు దీపావ‌ళి.  ఈ గ్రామానికి  ఆ పేరు రావ‌డం వెనుక కార‌ణం ఉన్న‌ది.  గ‌తంలో శ్రీకాకుళం ప్రాంతాన్ని ప‌రిపాలించే రాజు ఎండ‌వేడి ఎక్కువ‌గా ఉండ‌టంతో స్పుహ‌తప్పి ప‌డిపోయాడు.  కూలిప‌నులు చేసుకునే వ్య‌క్తులు రాజుగారికి సేవ‌లు చేశారు.  స్పుహ‌నుంచి కోలుకున్న రాజు ఆ గ్రామానికి దీపావ‌ళి అని పేరు పెట్టార‌ట‌.  

Read: ఆకాశంలో శాటిలైట్ రైలును చూశారా…!!

Exit mobile version