Site icon NTV Telugu

విజయవాడతో చెరగని అనుబంధం.. రిటైర్డ్‌ సీపీ శ్రీనివాసులు

విజయవాడకు కొత్తబాస్ వచ్చారు. ఇప్పటివరకూ సీపీగా బాధ్యతలు చేపట్టి రిటైరయ్యారు శ్రీనివాసులు. సంతృప్తికరంగా నా పదవీ విరమణ చేస్తున్నా అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాతో కలిసి పని చేసిన సిబ్బందికి తోటి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాకు ధన్యవాదాలు అన్నారు శ్రీనివాసులు.

మరో వైపు ఇన్ ఛార్జ్ సీపీ పాలరాజు మాట్లాడారు. బత్తిన శ్రీనివాసులు పోలీసు శాఖకు ఎనలేని సేవ చేశారు. ప్రతీ హోదాలోనూ తన మార్క్ చూపించారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తాం. ప్రతీ కేసును పారదర్శకంగా డీల్ చేశారు. పీడీ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేశారు. రౌడీయిజం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ రాష్ట్రంలోనే పేరు గాంచారు. నేను ఇన్ ఛార్జి సీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ప్రభుత్వం కొత్త సీపీని నియమించేవరకు ఇక్కడ పని చేస్తా అన్నారు పాలరాజు.

Exit mobile version