NTV Telugu Site icon

వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆ దారిగుండా అనుమ‌తి…

సాధార‌ణంగా ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంటారు.  ప్ర‌తీ వాహ‌నాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు.  అయితే, ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌త్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్ర‌తి ఒక్క‌రిని చెక్ చెస్తున్నారు.  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని అన్న‌పురెడ్డిప‌ల్లి రాజాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో వంద‌శాతం వ్యాక్సినేష‌న్‌ను పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు రాపురం గ్రామంలోకి ప్ర‌వేశించే శివారు ప్రాంతంలో ప్ర‌త్యేకంగా చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు.  ఆ మార్గం గుండా వ‌చ్చి వెళ్లే ప్ర‌తి ఒక్క‌రిని వ్యాక్సినేష‌న్ విష‌యంలో ఆరా తీస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ వేయించుకున్న వారిని మాత్ర‌మే  ఆ దారి ద్వారా అనుమ‌తిస్తున్నారు.  వ్యాక్సిన్ తీసుకోని వారికి అక్క‌డిక‌క్క‌డే వ్యాక్సిన్ వేస్తున్నారు.  ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో మిగ‌తా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌ని అధికారులు ఆలోచిస్తున్నారు.  

Read: ఆప‌రేష‌న్ స‌క్సెస్‌: మ‌నిషికి పంది కిడ్నీ…