NTV Telugu Site icon

Oscar For Naatu Naatu: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. ఉపేంద్ర ఏం అన్నాడంటే..

Upendra

Upendra

కన్నడ సినీ ఇండస్ట్రీలో ఉపేంద్ర స్టార్ హీరో. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉపేంద్రనటించిన చాలా కన్నడ సినిమాలు తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసాడు.. నటుడు ఉపేంద్ర.. తాజాగా ఉపేంద్ర కబ్జా అనే చిత్రంలో నటించారు. రేపు కబ్జా చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని ఉపేంద్ర దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ​నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం యావత్తు భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమని ఉపేంద్ర అన్నారు.

Also Read:Rain in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం.. వికారాబాద్‌లో వడగండ్ల వాన

కాగా, రేపు కబ్జా చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ట్రైలర్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు పెంచింది. దీంతో సినిమా విడుదల కోసం ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments