Site icon NTV Telugu

ఏపీ రేషన్ డిపోలో నిర్మలా సీతారామన్ ఆకస్మిక తనిఖీలు…

అనకాపల్లి తాళ్లపాలెంలోని రేషన్ డిపో లో ఆకస్మికంగా తనిఖీలు చేసారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా పై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్న ఆర్థిక మంత్రి… కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం గురించీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ నాథ్ ను వివరించమన్నారు నిర్మలా సీతారామన్. రేషన్ డిపోలలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫోటోలు వారు పెడితే కుదరదు. ప్రతీ రేషన్ డిపోలో మన అందరి అన్నా నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని క్లాస్ పీకారు కేంద్ర మంత్రి.

Exit mobile version