Site icon NTV Telugu

కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు..సాగు చట్టాలను మళ్లీ తెస్తాం!

కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామ‌ని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. వ్య‌వ‌సాయ సాగు చట్టాలపై ప్ర‌స్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌న్నారు.

https://ntvtelugu.com/uk-sets-new-record-corona-cases-in-a-single-day/

రైతుల‌కు ఆమోద యోగ్యంగా చ‌ట్టాల‌ను రూపొందించి… పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టడానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని కేంద్ర వ్య‌వసాయ శాఖ‌ మంత్రి న‌రేంద్ర తోమర్ అన్నారు. కాగా.. ఇటీవ‌లే.. కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న తో రైతులు కూడా ఢిల్లీలో ఆందోళ‌న‌లు విర‌మించారు. ఈ నేప‌థ్యంలో.. కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Exit mobile version