Site icon NTV Telugu

Bangalore Airport: యూఏఈ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం

Plane

Plane

అబుదాబికి బయలుదేరిన యూఏఈకి చెందిన విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. బెంగళూరు విమానాశ్రయంలో విమానం సాధారణ ల్యాండింగ్ అయిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఫ్లైట్‌ ఇన్‌స్పెక్షన్‌ పూర్తి చేసి, అనంతరం గమ్యస్థానానికి బయలుదేరింది. ఏప్రిల్ 2న బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అబుదాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం EY237, సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం బెంగళూరులో సాధారణ ల్యాండింగ్‌ను నిర్వహించింది. అవసరమైన సాంకేతిక తనిఖీలు పూర్తయ్యాయి. విమానం అబుదాబికి బయలుదేరి వెళ్లిందని ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది.

Also Read:Natural Star Nani: ‘దసరా’ లాంటి సినిమా మళ్లీ చేయను.. బాంబ్ పేల్చిన నాని

అంతకుముందు ఏప్రిల్ 1 న, దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే పక్షి ఢీకొనడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఫెడెక్స్ విమానం ఢీ కొట్టిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. FedEx ఒక కొరియర్, కార్గో విమానం.

Exit mobile version