NTV Telugu Site icon

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఇండియాలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు..

కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వదలనంటోంది. గత సంవత్సరంలో జనవరి 30న కరోనా కేసు కేరళలో నమోదైంది. అయితే అప్పటి నుంచి భారత్‌ను వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కునేందుకు శాస్త్రవేత్తలు శ్రమించి కోవిడ్‌ టీకాలను కనుగోన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి ప్రభావం ఇండియాపై తగ్గుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కరోనా వేరియంట్‌ బయటపడింది. ఈ వేరియంట్‌ వెలుగులోకి వచ్చి 10 రోజులే అవుతున్నా దీని వ్యాప్తి మాత్రం కరోనా డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు అధికంగా ఉంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌పై మోడీ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.

అంతేకాకుండా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచనలు కూడా ఇచ్చింది కేంద్రం. అయితే గత 10 రోజుల నుంచి ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి వేలాది సంఖ్యలో భారత్‌కు ప్రయాణికులు వచ్చారు. దీంతో ఇండియాలో కూడా ఒమిక్రాన్‌ వ్యాపించి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రకటించింది. అయితే విదేశాల నుంచి వచ్చి ఇద్దరు వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ బయట పడింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల వయస్సు 66, 46 ఏళ్ళుగా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్ Live | Omicron Tension Begins in India | Ntv Live