Site icon NTV Telugu

ఒమిక్రాన్ టెన్ష‌న్‌: 5 రోజుల్లో 12 వేల విమాన స‌ర్వీసులు ర‌ద్దు…

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అనేక దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి.  చాలా దేశాలు విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.  ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల్లో విమాన సర్వీసులు న‌డుస్తున్నా ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌, క్వారంటైన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి.  ఈ ప్ర‌భావం ఇండియా విమాన‌యాన రంగంపై కూడా ప‌డింది.  దేశంలో గ‌త కొన్ని రోజులుగా అనేక విమానాలు త‌మ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసుకుంటున్నాయి.  

Read: పీఆర్సీ ప్రాసెస్‌లో ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..!

శుక్ర‌వారం నుంచి ఈరోజు వ‌ర‌కు ఐదు రోజుల వ్య‌వ‌ధిలో సుమారు 12 వేల‌కు పైగా స‌ర్వీసులు ర‌ద్ద‌యిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  ప్ర‌తి ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి వారంలో విమాన స‌ర్వీసుల‌కు భారీ డిమాండ్ ఉండేది.  గ‌తేడాది క‌రోనా, ఈ ఏడాది ఒమిక్రాన్ కార‌ణంగా స‌ర్వీసులు ర‌ద్దు చేసుకుంటున్నారు.  రాబోయే రోజుల్లో మ‌రిన్ని స‌ర్వీసులు ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  దేశీయ స‌ర్వీసుల‌తో పాటు అంత‌ర్జాతీయ స‌ర్వీసులు కూడా ర‌ద్ద‌వుతుండ‌టంతో విమాన‌యాన రంగం మ‌రింత క‌ష్టాల్లో ప‌డిపోయే అవ‌కాశం ఉంది.

Exit mobile version