Site icon NTV Telugu

తాలిబ‌న్లు అంటే అదే… తుపాకీ గురిపెడుతూనే… శాంతి వ‌చ‌నాలు…

తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌ను ఆక్ర‌మించుకున్నారు.  ఆగ‌స్టు 31 త‌రువాత కాబూల్ ఎయిర్‌పోర్ట్ తో స‌హా అన్ని తాలిబ‌న్ల వ‌శం కాబోతున్నాయి.  ఆ త‌రువాత ఆ దేశం ప‌రిస్థితి ఎలా మారిపోతుంది అన్న‌ది అందిరిలోనూ ఉన్న ప్ర‌శ్న‌.  తాలిబ‌న్ల‌ను చూసి భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, తాము మారిపోయామ‌ని, తాము అంద‌రిని స‌మానంగా గౌర‌విస్తామ‌ని చెబుతున్నారు.  అయిన‌ప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌డంలేదు.  ఇక ఇదిలా  ఉంటే, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ చిన్న క్లిప్ వైర‌ల్ అవుతున్నది. తాలిబ‌న్ ముష్క‌రులు ఓ టీవీ ఛాన‌ల్‌లోకి ప్ర‌వేశించి, న్యూస్ యాంక‌ర్ వెనుక తుపాకులు ప‌ట్టుకొని నిల‌బ‌డి, తాలిబ‌న్ ఇస్లామిక్ ఎమిరేట్ ప్ర‌భుత్వానికి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారు మంచి ప‌రిపాల‌న అందించేందుకు, అంద‌ర్నీ స‌మానంగా చూసేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పించారు.  ఈ మాటులను పాపం ఆ న్యూస్ యాంక‌ర్ భ‌య‌ప‌డుతూ చెప్పాడు.  దీనికి సంబందించిన క్లిప్‌ను ఇరాన్‌కు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.  

Read: చంద్రబాబుపై ఎంపీ మిథున్‌ రెడ్డి ఫైర్

Exit mobile version