Site icon NTV Telugu

విశాఖ ఉక్కు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు : టీటీడీ చైర్మన్ వైవీ

YV Subba Reddy

YV Subba Reddy

విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు.


గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధితో ఏ కార్యక్రమం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవ్వటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెల‌కొంద‌ని.. ఓటీఎస్ విషయంలో టీడీపీ ప్రజల్లో భయాలను సృష్టించాలని చూస్తోందని చెప్పారు.

Exit mobile version