NTV Telugu Site icon

ఇందల్వాయిలో ఉద్రిక్తత… బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ ప్రారంభోత్సవం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

గన్నరం గ్రామం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవాలకు వెళ్ళారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన రావడానికి ముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు టీఆర్ఎస్ నేతలు. పసుపు బోర్డు ఏమైందంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. బాండ్ పేపర్, ప్లకార్డ్స్ చూపిస్తూ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే లేని సమయంలో ఎంపీ అరవింద్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తో బిజెపి టీఆరెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట ,రాళ్లదాడి జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్వల్ప లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు.