తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఫలితాలు వెలువడుతున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని నమోదు చేశారు ఎంసీ కోటిరెడ్డి.. నల్గొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండగా… చెల్లని ఓట్లు 50 మినహాయిస్తే.. 1,183 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు.. అందులో గెలుపు కోటా 593 ఓట్లు అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి.. స్వతంత్ర అభ్యర్థి నగేష్ 226 ఓట్లు సాధించగా… టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
Read Also: బూస్టర్ డోస్..! కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది బెటర్..?