అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఆరురాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఎంతమంది మరణించారో తెలియదని స్థానిక వార్తసంస్థలు పేర్కొన్నాయి. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనావేస్తున్నాయి.
Read: ఛండీగడ్ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..
టోర్నడోలు విరుచుకుపడిన ప్రాంతాల పరిస్థితులపై జో బైడెన్ సమీక్షను నిర్వహించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. త్వరలనే టోర్నడో విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పర్యటిస్తానని జో బైడెన్ పేర్కొన్నారు. మేఫీల్డ్ మృతుల్లో ఎక్కువమంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పరిచేసే కార్మికులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. 1925లో అమెరికాలో వచ్చిన టోర్నడోల తరువాత ఇదే పెద్ద విపత్తు అని, అప్పట్టో సుడిగాలులకు సుమారు 900 మందికి పైగా మరణించారు.
