టమోటా ధరలు మొన్నటివరకు భగ్గుమాన్నాయి.. ఏకంగా డబుల్ సెంచరీ చేశాయి.. జనాలు టమోటా మాట కూడా తియ్యలేదు.. ఇప్పుడు ధరలు పూర్తిగా పడిపోయాయి.. ఏపీ మదనపల్లి మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. మొన్నటివరకు ఏకంగా రెండు వందలుపైన పలికిన టమాటాలు ఇప్పుడు రికార్డుస్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమాటా ధరలు పతనమయ్యాయి…
గత మూడు రోజులుగా మార్కెట్లు టమాటా దిగుబడి పెరగుతుండటం తో ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కిలో 100 వరకు పలికిన టమాటాలు గురువారం మరింత తగ్గాయి. ఏ గ్రేడ్ టమాటాలు కిలో 50 నుంచి 64 మధ్య పలికాయి. మదనపల్లెలో బి గ్రేడ్ టమాటా ఏకంగా 36కు పడిపోయింది..అయితే టమోటా ధరల పతనంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గత నెల 29, 30న కిలో టమోటా ధర మదనపల్లి మార్కెట్ లో డబుల్ సెంచరీ కి చేరువైన టమోటా ఇప్పుడు కనిష్ఠ ధర 36 రూపాయలకు రావడంతో రైతాంగం దిగాలు చెందుతోంది. ఉన్నపళంగా ధరలు పడిపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు..
ఇక ఇప్పుడు రెండో రకం కిలో టమోటా ధర రూ.20 రూపాయలు పలుకుతుందని తెలుస్తుంది.. మరో రెండు, మూడు రోజుల్లో ధరలు ఇంకా తగ్గుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఉన్నపళంగా ధరలు పడిపోవడం తో రైతుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ లో మూడు రోజుల్లోనే టమోటా ధరల్లో ఇంత భారీ తేడాకు అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మదనపల్లి మార్కెట్ కు టమోటా దిగుబడి పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు బయర్ల నుంచి పోటీ లేకపోవడం ప్రధాన కారణం అంటున్నారు. పక్క జిల్లాల్లో కూడా టమోటా దిగుబడి ప్రారంభం కావడంతోనే ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఇక మరోవైపు ఉల్లి ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తుంది..