టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ను కరోనా బలి తీసుకుంది. ఆ విషయాన్ని ఇంకా మరువక ముందే ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మధుమేహం వ్యాహితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. బిఏ రాజు సతీమణి బి.జయ రెండేళ్ల క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు. మరో కుమారుడు శివ కుమార్… ప్రస్తుతం ’22’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిఏ రాజు ‘ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను నిర్మించాడు. ఆయన ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి లోనయ్యారు టాలీవుడ్ ప్రముఖులు. మహేష్ బాబు, ఎన్టీఆర్, కొరటాల శివ, విశాల్, నందమూరి కళ్యాణ్ రామ్, ఆనంద్ దేవరకొండ వంటి సెలెబ్రిటీలు ఆయన ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
బిఏ రాజు మృతికి సెలెబ్రిటీల సంతాపం
