NTV Telugu Site icon

అనుమానస్పద స్థితిలో టాలీవుడ్ సింగర్‌ తండ్రి మృతి..

టాలీవుడ్‌ సింగర్‌ హరిణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజులుగా సింగర్‌ హరిణి కుటుంబం కనిపించకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతున్న వేళ.. అందరూ షాక్‌ తినేలా హరిణి తండ్రి ఏకేరావు బెంగూళూరు సమీపంలోని ఓ రైల్వే మృత దేహం లభ్యమైంది. ఏకే రావు సుజన్‌ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు.

అయితే ఇప్పటివరకు కనిపించకుండా పోయిన కుటుంబ సభ్యులు ఇప్పడు బెంగుళూరు రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో కనిపించారు. అయితే గత వారం రోజులుగా జాడలేకుండా పోయిన కుటుంబ సభ్యులు ఎక్కడకు వెళ్లారు..? అసలు ఏకే రావుది ఆత్మహత్య, హత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు ఏకేరావుది మర్డర్‌ కేసుగా నమోదు చేసుకోవడం గమనార్హం.