NTV Telugu Site icon

ఆ గ్రామంలో దీపావ‌ళి ఎలా జ‌రుపుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు…

ఇటీవ‌లే దీపావ‌ళి వేడుక‌లు ముగిశాయి.  దీపావ‌ళి అంటే దీపాలు వెలిగించి ట‌పాసులు కాలుస్తూ సంబ‌రాలు చేసుకుంటారు.  దీపావ‌ళి వేడుక‌ల‌ను ద‌క్షిణ భార‌త‌దేశంలో మూడు రోజులు నిర్వ‌హిస్తే, ఉత్త‌రాదిన ఐదు రోజులు జ‌రుపుకుంటారు.  కొన్ని ప్రాంతాల్లో దీపావ‌ళి వేడుక‌లు చాలా విచిత్రంగా జ‌రుగుతాయి. క‌ర్ణాట‌క‌- త‌మిళ‌నాడు బోర్డ‌ర్‌లో గ‌మ‌టిపురా అనే గ్రామం ఉంది.  ఆ గ్రామంలో దీపావ‌ళి వేడుక‌ల‌ను చాలా విచిత్రంగా జ‌రుపుకుంటారు.  దీపావ‌ళి రోజున అంద‌రిలాగే దీపాలు వెలిగించి ట‌పాసులు కాలుస్తారు.  అయితే, దీపావ‌ళి ముగింపు వేడుక‌ల‌ను అందికంటే భిన్నంగా జ‌రుగుతాయి.  ముగింపు వేడుక‌ల స‌మ‌యంలో ఆవుపేడ‌ను గుండ్రటి బంతుల్లా చేసి ఒక‌రిపై ఒక‌రు విసురుకుంటారు.  ఇలా చేయ‌డం వ‌ల‌న గ్రామానికి మంచి జ‌రుగుతుంద‌ని, ఎలాంటి చెడు గ్రామంలోకి ప్ర‌వేశించ‌కుండా ఉంటుంద‌ని అందుకే ఇలా చేస్తామ‌ని చెబుతున్నారు గ‌మ‌టిపురా గ్రామ‌స్తులు.  

Read: ఆ హోట‌ల్‌లో ఏం తిన్నా రూ.10 రూపాయ‌లే… ఎక్క‌డో తెలుసా…