బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరి అనుకుంటే ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు బస్సు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బామ్మ టికెట్ లేకుండా ఫ్రీగా 3540 కిమీ ప్రయాణం చేసింది. 120 బస్సుల్లో ఒక్కసారి కూడా టికెట్ కొనకుండా ఫ్రీగా ప్రయాణం చేసిందట. అదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్నా. ఇంగ్లాండ్‌లో పెన్షనర్లకు కొన్ని బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసేందుకు అవకాశం వస్తుంది.
Read: ఒమిక్రాన్ భయానికి స్పైక్ ప్రోటీన్లో మార్పులే కారణమా…!!
అలా ఆ ఫ్రీ పాస్‌ను బామ్మ వినియోగించుకుందట. సెప్టెంబర్ 6 వ తేదీన బామ్మ అక్టోబర్ 16 వ తేదీన తన ప్రయాణాన్ని ముగించింది. ఈ ప్రయాణంలో బెడ్, బ్రేక్‌ఫాస్ట్ అనే వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదని, అవి దొరికితే అదృష్టంగా భావించినట్టు బామ్మ తెలియజేసింది. ప్రయాణంలో తాను చాలా ఎంజాయ్ చేశానని, ప్రకృతి అందాలను తనివితీర ఆస్వాదించానని బామ్మ తెలియజేసింది.