Site icon NTV Telugu

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఆ ముగ్గురిదే కీల‌క పాత్ర‌… కానీ చివ‌ర‌కు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక ఆ దేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ది.  అయితే, ప్ర‌పంచ దేశాల గుర్తింపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డంతో ఇబ్బందులు ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతున్న‌ది.  ఇక ఆఫ్ఘ‌న్ భ‌విత‌వ్యంలో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తులు ముగ్గురు ఉన్నారు.  ఒక‌రు అమెరికా రాయ‌బారి జ‌ల్మే ఖ‌లిల్జాద్‌, ఘ‌ని, స్టానిక్జాయ్‌.  ఈ ముగ్గురు కీల‌క పాత్ర పోషించారు.  కానీ, ఇప్పుడు వీరు తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు.  2002లో అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అడుగుపెట్టేందుకు కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తిగా ఖ‌లిల్జాద్‌కు పేరుంది.  తాలిబ‌న్ల‌ను అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌న్ నుంచి త‌రిమికొట్టాయి.  అప్ప‌టి నుంచి అమెరికాతో ఖ‌లిల్జాద్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.  అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌లోకి ప్ర‌వేశించిన స‌మ‌యంలో కీల‌క పాత్ర‌ను పోషించిన ఖ‌లిల్జాద్‌కు అమెరికా ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ బాధ్య‌త‌లను అప్ప‌గించింది అమెరికా స‌ర్కార్‌.  అయితే, అమెరికా ద‌ళాలు ఉప సంహ‌రించుకునే విష‌యంలో చేసిన త‌ప్పులు ఆ దేశాన్ని త‌ల‌వంచుకునేలా చేశాయి.  
దీనికి కార‌ణం ఖ‌లిల్జాదే అని, ఒక‌ప్పుడు ఖ‌లిల్జాద్ తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌గా, ఇప్పుడు వారికి అనుకూలంగా ప‌నిచేశార‌ని, ఖ‌లిల్జాద్ తాలిబ‌న్లు కు అమ్ముడుపోయార‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న్ను ఆఫ్ఘ‌న్ రాయ‌బారి ప‌ద‌వినుంచి తొల‌గించింది అమెరికా.  ఇక హ‌మీద్ క‌ర్జాయ్ త‌రువాత దేశం పున‌ర్నిర్మాణంలో కీల‌క పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి ఆష్ర‌ఫ్ ఘ‌ని.  అయితే, దేశంలో అవినీతిని పెంచి పోషించార‌ని, సైనిక బ‌లం పెంచాల్సిన స‌మ‌యంలో అధ్య‌క్షుడు ఘ‌ని చేతులెత్తేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  అమెరికా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ చేప‌ట్టిన వారం రోజుల్లోనే తాలిబ‌న్లు దేశాన్ని ఆక్ర‌మించుకున్నాయి అంతే ఆ దేశ బ‌ల‌గాలు ఎంత బ‌ల‌హీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇక‌పోతే, అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప సంహ‌రించుకోవ‌డంలోనూ, తాలిబ‌న్లు అధికారంలోకి రావ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించిన మ‌రో వ్య‌క్తి స్టానిక్జాయ్‌.  తాలిబ‌న్ల ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఖ‌త‌ర్ ఒప్పందాల‌ను తాలిబ‌న్లు ప‌క్క‌న పెట్టి హుక్కా గ్రూప్‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో స్టానిక్జాయ్ తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు.  ఆయ‌న‌కు తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్ట‌ర్ ప‌ద‌వి ద‌క్కిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌లేదు. ఈ ముగ్గురు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భ‌విత‌వ్యంలో కీల‌క పాట్ర‌లు పోషించిన‌ప్ప‌టికీ ఎవ‌రికీ సంతోషం మిగ‌ల‌లేదు.  

Read: అక్టోబ‌ర్ 20 నుంచి ష‌ర్మిల పాద‌యాత్ర‌…

Exit mobile version