హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కి మంచి డిమాండ్ ఉన్నది. కేవలం హైదరాబాద్ కు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు కూడా ఈ బిర్యానీ ఎగుమతి అవుతుంటుంది. అయితే, భాగ్యనగరంలో ఈ బిర్యానీ ఒక్కటి మాత్రమే కాదు. ఎన్నో రకాల వంటకాలు ఫేమస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెగ్‌పీస్ జాయింట్ పీస్ బిర్యానీ. డొన్నె బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, మండీ బిర్యానీ, ఇందులో డొన్నె బిర్యానీ బెంగళూరులో ఫేమస్ కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా దొరుకుతున్నది. అయితే, మామూలు బిర్యానీకి ఉపయోగించే బాస్మతీ బియ్యం కాకుండా జీరాసాంబా లేదా చిట్టిముత్యాల బియ్యాన్ని ఈ డొన్నె బిర్యానీ తయారీ కోసం వినియోగిస్తారు.
హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ ఒక్కటే కాదు… ఇవీ ఫేమస్సే…
