వేసవిలో మార్కెట్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో తాటి ముంజలు ఒకటి. పుచ్చకాయ, మామిడికాయ, కర్బూజతో పాటు సమానంగా ఇందులో పోషక విలువలు ఉంటాయి. జెల్ లాగా కనిపించే ఈ తాటి ముంజ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎలాగంటే…
అసలు ఈ ముంజలను ఎలా తినాలి?
చాలా మంది ముంజలపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. అసలు విషయమేమిటంటే… ఆ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. ఇదే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. అందుకే పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని వెంటనే అందిస్తుంది. ముఖ్యంగా పింపుల్స్, యాక్నీ వంటి చర్మ సమస్యలను దూరం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముంజల్లో ఉండే నీరు మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే ముంజలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ యాక్టివ్ గా ఉంటుంది. అనారోగ్య సమస్యలైన మల బద్ధకం, ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఐరన్, జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ,బి,సి ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ముంజల్లో ఉండే నీరు శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ముంజల్లో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. మహిళలకు సోకే బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు వివిధ రకాల ట్యూమర్స్ కు కారణమయ్యే ఫైటో కెమికెల్స్, అంథోసయనిన్ వంటి వాటిని కూడా తొలగించడంలో సహాయ పడతాయి.
Read Also: Vellampalli: సంతృప్తికరంగా పని చేశా.. మంత్రులను మారుస్తామని అప్పుడే చెప్పారు..
