NTV Telugu Site icon

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

ts government logo

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవలే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌, ఫీజు రియంబర్స్‌మెట్‌ దరఖాస్తు గడువు డిసెంబర్‌ 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ గడువును పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ పాస్‌ ద్వారా విద్యార్థులు జనవరి నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.

ఇప్పటివరకు తక్కువ శాతంలో విద్యార్థులు స్కాలర్‌ షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారని.. అందుకే దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.