Site icon NTV Telugu

తెలంగాణలో ఒమిక్రాన్‌.. వచ్చే రెండు వారాలు మనకు కీలకం : డీహెచ్‌ శ్రీనివాస్‌

DH Srinivasa Rao

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోందని, వచ్చే రెండు నుంచి నాలుగు వారాల దేశానికే కాదు రాష్ట్రానికీ ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. కానీ.. సుమారు 30 రెట్ల వేగం వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. యూకే, యూఎస్‌ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించి కరోనా వైరస్‌ కట్టడికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు.

Exit mobile version