కరోనాకు ముందు నిబంధనలు, షరతులు అంటే ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, కరోనా సమయంలో, కరోనా తరువాత నిబంధనలను ప్రజలు విధిగా పాటిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రమే కాదు, కరోనా సమయంలో గ్రామాలు కూడా సొంతంగా నిబంధనలు విధించుకున్నాయి. ఆయితే, ఆ గ్రామంలో చాలా కాలంగా ఓ నిబంధనల అమలులో ఉన్నది. ఆ గ్రామంలో నివశించే వ్యక్తులు ఎవరైనా సరే ఆ పని చేయాల్సిందే.
Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు… ఆయనకు కేబినెట్ బెర్త్?
ఇంతకీ ఏంటా పని? ఏంటా గ్రామం అని అనుకుంటున్నారా… అంటార్కిటికా అంటే మంచుతో కప్పబడిన ప్రాంతం. రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రజలు నివశిస్తుంటారు. అదీ అతి తక్కువ సంఖ్యలోనే. అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి జీవించడం అంటే చాలా కష్టమైన విషయం. దవాఖానాలు అందుబాటులో ఉన్నా ఆపరేషన్ చేసేందుకు వసతులు లేవు. దీంతో విల్లాలాస్ ఎస్ట్రెల్లాస్ గ్రామంలో నివశించాలి అంటే తప్పని సరిగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకొని ఉండూకాన్ని తొలగించుకోవాలి. అలా ఉండూకాన్ని తొలగించుకున్న వారికి మాత్రమే ఆ గ్రామంలో నివశించే అవకాశం ఉంటుంది.