జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ షో ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రూ.కోటి ఎవరూ గెలుచుకోలేదు. అయితే తొలిసారిగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రూ.కోటి గెలుచుకున్న ఘనత సాధించినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
Read Also: దేశంలో భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ యూజర్లు
భద్రాద్రి జిల్లాలోని డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఎవరు మీలో కోటీశ్వరులు షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో సోమవారం (నవంబర్ 15) ప్రసారం కానుంది.
