NTV Telugu Site icon

వాయిదా వేయండి.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

KRMB

KRMB

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. గెజిట్‌ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. దీంతో… ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి… ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాయి…

అయితే, రేపు నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరు బోర్డులకు సంబంధించిన ఛైర్మన్లకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ… రేపటి సమావేశాన్ని వాయిదా వేసి.. మరో తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డు చైర్మన్లకు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్. కాగా, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలను నడుస్తూనే ఉన్నాయి… విమర్శలు, ఆరోపణలతో పాటు.. ఫిర్యాదులు కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే.