తెలంగాణలో రచ్చరేపుతోంది జీవో నెంబర్ 317. ఈ జీవో పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 371 డి ని పార్లమెంట్ లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని కోర్టుకు తెలిపారు పిటిషనర్. 317 జీవో పై స్టే ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య.
స్టే ఇవ్వడానికి నిరాకరించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. సెంట్రల్ హోమ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ హెల్త్ సెక్రటరీ, సంగారెడ్డి కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.
