NTV Telugu Site icon

సైదాబాద్ చిన్నారి కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం…

సైదాబాద్‌లో అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి చైత్ర కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు ప‌రామ‌ర్శించారు.  బాధిత కుటుంబాన్ని మంత్రులు ఓదార్చారు.  మంత్రులు మ‌హ‌మూద్ అలీ, స‌త్య‌వ‌తిలు సైదాబాద్ వెళ్లి చిన్నారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.  నిందితుడిని ప‌ట్టుకొని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు.  చిన్నారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున రూ.20 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించారు. త‌మ పాప‌ను పొట్ట‌న పెట్టుకున్న నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని చిన్నారి త‌ల్లిదండ్రులు మంత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త వారం రోజుల‌గా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.  నిందిడుతిని ప‌ట్టుకోవ‌డానికి నాకాబందీ నిర్వ‌హిస్తున్నారు.  నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ.10 ల‌క్ష‌లు అందిస్తామ‌ని పోలీసులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.  

Read: రాష్ట్రంలో 15 రోజుల్లో కోటి టీకాలు…