Site icon NTV Telugu

తెలకపల్లి రవి : అనిశ్చిత పర్వంలో ప్రతిపక్ష రాజకీయాలు

కోవిడ్‌ 19 మలిదశ తీవ్రతతో ప్రధానిమోడీ బ్రాండ్‌ తగ్గిన బిజెపి కాయకల్ప చికిత్సల కోసం అవస్థ పడుతుంటే ఇతర పార్టీల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఒక అనిశ్చితి అంతటా ఆవరించింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ కూడా ఎంతకూ కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీ ముఖ్యనాయకులైన జితిన్‌ ప్రసాద్‌ వంటివారు బిజెపిలో చేరడం,రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్‌ కేంద్రంగా అసమ్మతి పునరావృతం కావడం, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌పై నవజ్యోతి సిద్దు తదితరుల తిరుగుబాటు వంటివి ఎడతెగని సమస్యలుగా మారాయి.జితిన్‌ ప్రసాద్‌ నిష్క్రమణ తర్వాత జి23 లేఖ రాసిన వారు మరోసారి గొంతు విప్పారు. పార్టీ పునరుజ్జీవంపై సోనియారాహుల్‌నాయకత్వంతగువ్యూహం తీసుకోలేకపోతున్నదనే విమర్శలువిజృంభించాయి. తెలంగాణ పిసిసిఅద్యక్షుడి ఎంపికపై కూడా ఎడతెగనివాయిదాలతో గడిపేస్తున్నది.మొన్ననే ఓడిపోయిన కేరళలోనూ పిసిసిఅద్యక్షుడు శాసనసభా నాయకుడి నిర్ణయం వివాదమైంది.మహారాష్ట్ర ఎంవిఎ కూటమిలో శివసేన ఎన్‌సిపిలు కలసి వ్యవహరిస్తుంటే కాంగ్రెస్‌ వంటరిపాటుకు గురైంది.ఒక జాతీయ రాజకీయ శక్తిగా తన స్థానాన్ని వేగంగా బలహీన పర్చుకుంటున్నదనే అంచనాలు పెరుగుతున్నాయి.


అధికారంలో వున్న లేని ఇతర ప్రాంతీయ పార్టీలూ ఏమంత మెరుగ్గా లేవు. యుపిలో బిజెపి అంత ఇబ్బందిలో వుండగా ఎస్‌పి,బిఎస్‌పి కీచులాటలే కొనసాగుతున్నాయి. బిఎస్‌పి 19మంది ఎంఎల్‌ఎలలోఏడుగురు మాత్రమే దానితో మిగిలారు. కొందరు ఎస్‌పితో చేరారు. బిజెపిని ఎదుర్కొవడంలో ఈ రెండుపార్టీలూ ఎలా వ్యవహరిస్తాయనేది ఇంకా అస్పష్టం. ఎస్‌పి నేత అఖిలేష్‌పై దాడి కేంద్రీకరించిన బిఎస్‌పిఅధినేత్రి మాయావతి పంజాబ్‌లో అకాలీదళ్‌తో అవగాహన కుదర్చుకున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు కొనసాగింపుపై బేరసారాలు సాగుతున్నాయి. పంజాబ్‌ మధ్య ప్రదేశ్‌ వంటిచోట్ల కూడా బిఎస్‌పిగతంలో వున్న పట్టు కోల్పోయిందని ఎన్నికల వివరాలు చెబుతున్నాయి. బీహార్‌లో మూడోస్థానాసికి పడిపోయి ముఖ్యమంత్రి పదవి పొందిన నితిశ్‌ బిజెపిపై పరోక్ష విమర్శలు చేస్తూనే తమ బలంపెంచుకోవడానికి కాంగ్రెస్‌ వారిపైవల వేస్తున్నారు.

read also :ఉత్తమ్, భట్టి వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి : వీహెచ్

చాలా కాలం తర్వాత లాలూయాదవ్‌ జైలునుంచి బెయిలుపై విడుదలైనారు. బెంగాల్‌లో తాజాగా మూడోసారి ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ శాంతి భద్రతల వైఫల్యంపై విమర్శలు ఎదుర్కొవడంతో పాటు కేంద్రంతో ఘర్షణ కొనసాగిస్తున్నారు. తాను గతంలో పోషించిన పాత్రను మానేస్తున్నట్టు చెప్పిన ప్రశాంత్‌ కిశోర్‌ ఐ క్యాప్‌ టీంతో మమత మళ్లీ కాంట్రాక్టు కుదుర్చు కున్నారు.ఆమె జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకులుగా వుంటారనే ప్రచారం సాగుతున్నా బలపర్చినవారు దాదాపులేరు.ఈపూర్వరంగంలో ప్రశాంత్‌కిశోర్‌ ఎన్‌సిపి కురువృద్ధుడు శరద్‌పవార్‌తో సమావేశంకావడం ప్రత్యామ్నాయవేదికకు పునాది అని మరోప్రచారం వినిపించింది.అసలు పికెనే ప్రధాని మోడీకి సరైన ఢీ అని కూడా కథలు వినిపిస్తున్నాయి. ఒక ప్రచార వాణిజ్య మార్కెట్‌ సంస్థ దేశ రాజకీయాలలో ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుందనే కథనం రాజకీయ పార్టీల దురవస్థను చెబుతుంది.

గతంలో ప్రాంతీయ పార్టీల పోకడలను గమనించిన వారెవరైనా ఇంత తేలిగ్గా వాటి గురించి జోస్యాలు చెప్పరు. గతంలో రెండు మూడు సార్లు కూడా ఎన్నికల అనంతరమే రాజకీయ కూటములు ఏర్పడి కేంద్రంలో అధికారం చేపట్టాయి గాని మూడేళ్ల ముందే ఏర్పడిన దాఖలాలు లేవు. ఏర్పడినవి నిలబడిరదీ లేదు.ఒక్కరోజులో యునైటెడ్‌ ప్రంట్‌ కన్వీనర్‌ నుంచి ఎన్‌డిఎ సంధానకర్తగా మారిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వంటివారి ఉదాహరణలున్నాయి. ఇప్పుడూ ఆయన అడగకుండానే కేంద్రానిక మద్దతు ప్రకటించారు. రాష్ట్రాలలో తమకు తిరుగులేదని భావించే నవీన్‌ పట్నాయక్‌, జగన్‌, కెసిఆర్‌ వంటివారు బిజెపితో పోరాడటానికి సిద్ధంగా లేరు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం రాష్ట్రాల తరపున గట్టిగా మాట్లాడుతున్నారు,

ఈ మధ్య వాక్సిన్‌పై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌లేఖ రాయడం తర్వాత నవీన్‌ జగన్‌లు కూడా తమ పద్ఠతిలోస్పందించడం కేంద్రం దిగిరావాలసిన పరిస్తితిని సృష్టించింది, బిజెపి అందులోనూ మోడీ నాయకత్వం తనమౌలికవిధానాలు మార్చుకునేది వుండదుగనక ప్రతికూలత పెరగవచ్చు కూడా. ఎన్నికల ముచ్చట అవివచ్చినప్పుడే గాని ఈలోగారాష్ట్రాలహక్కులకోసం ప్రజాశ్రేయస్సుకోసం ఉమ్మడిగాపోరాడితేనే కేంద్రందిగివస్తుంది తప్ప ఎవరికివారు తమ అవకాశవాదాలలో కూరుకుపోతే తీరం చేరడం కుదిరేపని కాదు.పెట్రో మంటలపై నిరసనోద్యమం,రైతాంగంఉమ్మడిపోరాటం వంటివి అందుకు దారిచూపిస్తాయి

Exit mobile version