NTV Telugu Site icon

నా వెనుక కుట్రలు పన్నుతున్నారు…తణుకు ఎమ్మెల్యే కారుమూరి

తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాజా పరిణామాలపై గుర్రుగా వున్నారు. నా వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారు.గత ఎన్నికల నుంచి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి…ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడ్డాయన్నారు. నా ఫ్లెక్సీలు నేనే వేసుకోను.. కార్యకర్తలే వేస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయినా…వంకా రవి ఫ్లెక్సీల్లో నా బొమ్మ వేయలేదు.

వంకా రవి పార్టీ పక్కన పెట్టిన సాయిరాం అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు. అందుకే నేను చిరాకు పడ్డాను. కానీ, నేను ఎవరినీ దూషించ లేదు. మా నియోజకవర్గంలో రెడ్లు అందరూ నాకు మద్దతుగా నిలబడ్డారు. ఎల్లుండి మూడు మండలాల నుంచి నాయకులు వచ్చి సుబ్బారెడ్డిని కలుస్తున్నారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేశానని కొంత మందికి నా మీద ఈర్ష్యగా ఉంది. ఎదురుగా వస్తే పోరాడ వచ్చు… వెనుక నుంచి పొడిచే వాళ్ళను ఎక్కడ తట్టుకుంటాం. మా జిల్లా ఇంఛార్జ్ సుబ్బారెడ్డి దృష్టికి ఈ విషయాలను తీసుకుని వెళ్ళానన్నారు కారుమూరి.