రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. చమురుతో నడిచే వాహనాలు, విమానాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, సరైన అవగాహన కల్పించకుంటే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా పెద్దగా వినియోగంలోకి రాదు.
చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక పనుల కోసం బొగ్గును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బట్టల ఇస్త్రీ కోసం బొగ్గుతో నడిచే ఇస్త్రీ బాక్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే, తమిళనాడుకు చెందిన వినీష అనే చిన్నారి ఎలాగైనా దీనికి విరుగుడు కనుక్కొవాలని నిర్ణయం తీసుకుంది. ఓ సైకిల్‌కు పెద్ద బాక్స్‌ను ఏర్పాటు చేసి, పైన సోలార్ ప్యానెల్లు అమర్చింది. సోలార్ ఎనర్జీ ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసి దాని ద్వారా వచ్చే కరెంట్‌తో ఇస్త్రీని, ఫ్యాన్, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా సాకెట్స్ ను ఏర్పాటు చేసింది వినీష. చిన్నారి వినీష కృషిని మెచ్చుకుంటూ బీబీసీ ఓ చిన్న డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: ప్రపంచంలోనే అత్యంత పిసినారి మహిళ ఎవరో తెలుసా?