Site icon NTV Telugu

డ్రైవ‌ర్ల‌కు తాలిబ‌న్ కీల‌క ఆదేశాలు… అయోమ‌యంలో ట్యాక్సీవాలాలు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక  ఆ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టి వ‌ర‌కు తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌క‌పోవ‌డంతో ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు.  చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల త‌రువాత, వారిని స్పూర్తిగా తీసుకొని దేశీయంగా కొన్ని తీవ్ర‌వాద సంస్థ‌లు బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కీల‌క ప్రాంతాల్లోని మ‌సీదుల్లో పెలుళ్ల‌కు పాల్ప‌డుతున్నారు.  దీంతో వంద‌లాది మంది సామాన్యులు బ‌లైపోతున్నారు.  

Read: కొత్త‌గా పెళ్లైన వారు హ్యాపీగా ఉండాలంటే… ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి…

దీనిపై తాలిబ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ట్యాక్సిల్లో గ‌న్‌తో ఉన్న వ్య‌క్తుల‌ను ఎక్కించుకోకూడ‌ద‌ని ఆదేశాలు జారీచేసింది.  తాలిబ‌న్‌, అనుబంధ వ్య‌క్తుల‌ను త‌ప్పా మిగ‌తా వ్యక్తులు ఎవ‌రైనా స‌రే గ‌న్‌తో ట్యాక్సిలో ఎక్కాల‌ని ప్ర‌య‌త్నించిన‌పుడు అధికారుల‌కు తెలియ‌జేయాల‌ని తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఆదేశించింది.  ఒక‌వేళ ఎవ‌రైనా ఆదేశాల‌ను పాటించ‌కుండా అలాంటి వారిని ట్యాక్సిలో ఎక్కించుకుంటే డ్రైవ‌ర్ల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తాలిబ‌న్ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.  

Exit mobile version