Site icon NTV Telugu

శివాజీరావు గైక్వాడ్‌ టూ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. అంతులేని కథతో ఆరంభం..

తమిళ్‌ తలైవా.. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పుట్టినరోజు నేడు. రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.. ఆయన కర్ణాటకలో 1950 డిసెంబర్‌ 12 జన్మించారు. అయితే ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన సినీ జీవితం 1975లో ప్రారంభమైంది. ఆయన సినిరంగప్రవేశం చేయకముందు కొన్ని రోజులు బస్‌ కండక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన మొదటి సినిమా తమిళంలో ‘ఆపూర్వరాగంగళ్‌’.. ఈ సినిమాకు దర్శకుడు కె.బాలచందర్‌.. రజినీ 1976లో ‘అంతులేని కథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

అప్పటినుంచి ఆయన దక్షిణాది సినిమాలపై దృష్టిపెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. రజినీ సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడ్డారో చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా ఆయన సినిమాలో చాన్స్‌కోసం ఇండస్ట్రీల చుట్టూ తిరిగిన సంఘటనలను సన్నివేశాలుగా మలిచి సినిమాల్లో కూడా వాడుకున్నారు. ఇటీవల వచ్చిన పెద్దన్న సినిమా వరకు ఆయన 167 సినిమాల్లో నటించారు.

ఆయనను 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా 2019లో దాదా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన దరిచేరింది. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ లో HBDSuperstarRajinikanth అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

https://twitter.com/Nayanthaara4/status/1469848777930407937?s=20
Exit mobile version