జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని ఆత్మవిశ్వాసం, పితృత్వం, గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగం , అధికారానికికారకుడిగా భావిస్తారు. అలాగే శని దేవుడిని కష్టపడి పనిచేయడం, న్యాయం, ఉద్యోగం, కర్మఫలాలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు శక్తివంతమైన గ్రహాల మధ్య సహజంగానే శత్రు సంబంధం ఉంది. తాజాగా నవంబర్ 1, 2026 రాత్రి 9:28 గంటలకు సూర్య, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో సంచరించడం ప్రారంభించాయి. దీనివల్ల జ్యోతిష్య రీత్యా ‘షడాష్టక యోగం’ ఏర్పడింది. ఈ అశుభ యోగం ప్రభావంతో పలు రాశుల వారు తమ వృత్తి, ఆర్థిక విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ జీవితం, కెరీర్ విషయంలో ఆరు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మేష రాశిపై షడాష్టక యోగ ప్రభావం
ఈ అశుభ యోగ ప్రభావం మేష రాశి జాతకులపై స్పష్టంగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి సూర్యుడు సప్తమ స్థానంలో (ఏడవ ఇల్లు), శని వ్యయ స్థానంలో (12వ ఇల్లు) సంచరిస్తున్నారు. జ్యోతిషంలో ఏడవ ఇల్లు వివాహం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యాలు, ప్రజా సంబంధాలను సూచిస్తుంది. అలాగే 12వ ఇల్లు ఖర్చులు, విదేశీ వ్యవహారాలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడికి ప్రతీకగా నిలుస్తుంది. సూర్య-శనుల కలయిక వల్ల ఏర్పడిన ఈ షడాష్టక యోగం కారణంగా మేష రాశి వారి వైవాహిక జీవితంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రత్యేక కాలంలో జీవిత భాగస్వామితో చిన్నచిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు వచ్చే సూచనలున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలు, సంపద లేదా బాధ్యతల విషయంలో విభేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసేవారికి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా విదేశాలకు సంబంధించిన పనులు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనుల్లో ఊహించని జాప్యం జరిగే అవకాశం ఉంది.
పాటించాల్సిన జాగ్రత్తలు , పరిహారాలు
ఈ సమయంలో మేష రాశి వారు అత్యంత సంయలనంతో వ్యవహరించాలి. కోపంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో లేదా బంధువులతో సమస్యలు తలెత్తితే వాటిని గొడవలకు తావు ఇవ్వకుండా కేవలం ప్రశాంతమైన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ యోగ దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి , శని దోషాల నివారణకు మేష రాశి వారు శనివారం రోజున పేదవారికి లేదా వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం.

