Site icon NTV Telugu

ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కార‌మే శిక్ష‌లు… తాలిబ‌న్ల కీల‌క నిర్ణ‌యం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌మీకృత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన తాలిబ‌న్లు దానిని ప‌క్క‌న పెట్టేశారు.  ష‌రియా చ‌ట్టాల ప్ర‌కార‌మే పాల‌న ఉంటుంద‌ని, పురుషులు చేయ‌లేని ప‌నుల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.  అంతేకాదు, విద్య విష‌యంలో కూడా మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్న‌ది.  ఇక ఇస్లామిక్ చ‌ట్టాల‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌డానికి ఓ శాఖ‌ను ఏర్పాటు చేశారు.  చ‌ట్లాల‌ను ఏవ‌రైనా ఉల్లంఘిస్తే చేతులు, కాళ్లు న‌ర‌క‌డం, బ‌హిరంగంగా ఉరితీయ‌డం వంటివి తిరిగి అమ‌లు చేయ‌బోతున్నారు.  ఇస్లామిక్ చ‌ట్టాల ప్ర‌కార‌మే శిక్ష‌లు ఉంటాయ‌ని ఖ‌రాఖండిగా చెప్పేశారు తాలిబ‌న్లు.   ఇత‌ర దేశాల్లోని చ‌ట్టాల అమ‌లుపై తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేద‌ని, త‌మ దేశ చ‌ట్టాల్లో కూడా ఇత‌రుల జోక్యం అవ‌స‌రం లేద‌ని తాలిబ‌న్ నేత‌లు చేబుతున్నారు.  

Read: వైర‌ల్‌: సింహాన్ని బెద‌ర‌గొట్టిన తాబేలు…

Exit mobile version