Site icon NTV Telugu

ఆ దేశాల నుంచి విమానాలు నిలిపివేయండి : కేజ్రీవాల్‌

కరోనా మహమ్మరి యావత్తు ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. కోవిడ్‌ ప్రభావంతో ఎన్నో కుటుంబాలు అల్లకల్లోలమయ్యాయి. ఎంతో మంది అనాథలుగా మారారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి భారతవాని కోలుకుంటోంది. అయితే తాజాగా మరో వేరియంట్‌ B.1.1.529 ప్రబలుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్-19 పరిస్థితి, టీకాపై పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ హాజరుకానున్నారు.

Also Read : డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న రాయలచెరువు.. మరో 3 చోట్ల లీకేజీలు..

అయితే తాజాగా దీనిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కొత్త వేరియంట్‌తో ప్రభావితమైన దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని మోడీని కోరారు. అతి కష్టం మీద మన దేశం కరోనా నుంచి కోలుకుందని, ఈ కొత్త వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.

Exit mobile version