Site icon NTV Telugu

భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులపై ఆందోళనలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల మధ్య అంతటా నష్టాలను చూసాయి. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ 1,028.61 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 55,983.13 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 307.50 పాయింట్లు (1.81 శాతం) తగ్గి 16,677.70 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్ 4 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా ఉంది. తర్వాతి స్థానాల్లో టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎన్టీసీపీ, ఎంఅండ్‌ఎంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లు ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.

Exit mobile version