జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురానుభూతి. పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి పనుల నుంచి పెళ్లి పత్రిక వరకు వైవిధ్యం కనబరచాలని చాలా మందికి ఉంటుంది. అయితే, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ లో పనిచేసే డాక్టర్ సందేశ్ తన పెళ్లి పత్రికను కూడా తన స్టాక్ మార్కెట్ భాషలో అచ్చువేయించాడు.
పెళ్లి పత్రికలో వాడిన పదాలన్నీ స్టాక్ మార్కెట్‌లో నిత్యం వినే పదాలకు అన్వయించారు. వివాహ పత్రిక ఆహ్వానాన్ని ఐపీఓ గా పేర్కొన్నారు.
Read: ఎలన్ మస్క్ వివాదాస్పద ట్వీట్… తిట్టిపోస్తున్న జనాలు…
వధువరులను రెండు కంపెనీలుగాను, రెండు కంపెనీలు కలిస్తే వ్యాపారం బాగుంటుందని ప్రమోటర్లు పేర్కొనడంతో రెండు కంపెనీలను మెర్జ్ చేస్తున్నట్టుగాను, పెళ్లి మండపాన్ని స్టాక్ ఎక్చేంజీగాను పేర్కొనడం విశేషం. అంతేకాదండోయ్.. పెళ్ళికి వచ్చే బంధువులను ఇన్వెస్టర్లుగాను, పెళ్లి రిసెప్షన్ తేదీలను బిడ్డింగ్ డేట్స్‌గాను, సంగీత్‌ను రింగింగ్ బెల్ గాను, లంచ్ కార్యక్రమాన్ని డివిడెండ్ అన్నారు. అంతేనా.. వసతి సౌకర్యాన్ని బోనస్ గాను, తల్లిదండ్రులను ప్రమోటర్లుగా పేర్కొంటూ పెళ్లి పత్రికను అచ్చువేయించారు. ఈ పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.