Site icon NTV Telugu

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ

విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా వుంటుంది. క్షణాల్లో మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవచ్చు. అది కూడా అంతా బాగుంటే.. అదే విమానానికి ట్రబుల్ వచ్చినా.. వాతావరణం అనుకూలించకపోయినా అంతే సంగతులు. మనం ఎక్కాల్సిన విమానానికి టికెట్లు బుక్ అయినా ఎక్కలేని పరిస్థితి వస్తే ఎలా వుంటుందో ఊహించలేం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయింది విమానం. దీంతో ఆకుటుంబం ఆందోళనలో వుంది.

బయటకు వదలని సెక్యూరిటి సిబ్బంది తీరుతో ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ నుండి కొలంబో వెళ్ళేందుకు శ్రీలంక ఎయిర్ లైన్స్ కు టికెట్ బుక్ చేసుకున్నారు నలుగురు కుటుంబ సభ్యులు. ఎయిర్ పోర్ట్ కు వచ్చాక తమ టికెట్లు బుకింగ్ కాలేదంటూ చేతులు ఎత్తేసింది ఎయిర్ లైన్స్ సంస్థ. వారిని విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా.. బయటకు వెళ్ళేందుకు నిరాకరించారు సెక్యూరిటి సిబ్బంది. దీంతో ఎయిర్ పోర్టులో మూడు గంటలుగా బందీ అయింది ఆ ఫ్యామిలీ. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు కుటుంబ సభ్యులు ఇబ్బందిపడుతున్నారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.

Exit mobile version