Site icon NTV Telugu

విశాఖ‌లో మ‌ళ్లీ పుంజుకుంటున్న విమానయాన‌ సేవ‌లు…

క‌రోనా త‌రువాత విశాఖ‌లో విమాన‌యాన రంగం సేవ‌లు క్ర‌మంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్‌, స్కూట్ ఎయిర్ స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి.  జ‌న‌వ‌రి 1 నుంచి విశాఖ-తిరుప‌తి, కోల్‌క‌తా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు న‌డ‌వ‌బోతున్నాయి.  అదేవిధంగా డిసెంబ‌ర్ 29 నుంచి విశాఖ‌-సింగ‌పూర్ మ‌ధ్య స్కూట్ ఎయిర్ స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

Read: నేడు త‌ణుకులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌…

దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాల‌ను విమాన‌యాన సంస్థ‌లు ప్రారంభించింది.  క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఈ స‌ర్వీసుల‌ను విమాన‌యాన సంస్థ‌లు నిలిపివేశాయి.  దేశీయంగా స‌ర్వీసులు న‌డుస్తున్న‌ప్ప‌టికీ కొన్ని ప్రాంతాల‌కు స‌ర్వీసుల‌ను నిలిపివేశారు.  కాగా, ఇప్పుడు క‌రోనా కేసులు త‌గ్గిపోవ‌డంతో వీటిని తిరిగి పున‌రుద్ద‌రించారు.  

Exit mobile version