Site icon NTV Telugu

Korean actress: దక్షిణ కొరియా నటి జంగ్ చై-యుల్ అనుమానాస్పద మృతి

Korean Actress

Korean Actress

దక్షిణ కొరియా నటి జంగ్ చై-యుల్ మృతి చెందింది. అపార్టమెంట్‌ లోని నటి ఇంట్లో శవమై కనిపించింది. ఆమె వయసు 26 సంవత్సరాలు. అయితే ఆమె మరణానికి కారణం ఇంకా తెలియలేదు. ఆమె అంత్యక్రియలు ఆమె కుటుంబ సభ్యుల కోరికలకు అనుగుణంగా ప్రైవేట్‌గా నిర్వహిస్తారని తెలుస్తోంది. అంత్యక్రియలకు సన్నిహిత బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని నటి సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు జాంగ్ చాయ్ మృతిపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read:Air Journey: ప్రపంచంలోనే అతి తక్కువ దూరం.. ప్రయాణించే విమానం అదే

2016 రియాలిటీ సిరీస్ తో తన కేరియర్ ను ప్రారంభించిన చై-యుల్.. “డెవిల్స్ రన్‌వే”లో మోడల్‌గా అరంగేట్రం చేసింది. అయితే ఇటీవల దక్షిణ కొరియా కామెడీ “జోంబీ డిటెక్టివ్”లో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందింది.
ఆమె తాజాగా నటిస్తున్న K-డ్రామా సిరీస్ “వెడ్డింగ్ ఇంపాజిబుల్” చిత్రీకరణ మధ్యలో ఉంది. ఇందులో ఆమె ప్రముఖ పాత్రను పోషించింది. ఆమె మృతితో ఈ సిరీస్ షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కాగా, జంగ్ తన మరణానికి మూడు రోజుల ముందు తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకుంది.

Exit mobile version