NTV Telugu Site icon

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇదంతా బద్వేలులో వైసీపీ విజయం సాధించినందుకు అనుకుంటున్నారా? కాదండి. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: బీరువాలో లక్షదాచిన వృద్ధుడు… ఆ తర్వాత ఏమైంది?

ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దళిత సామాజిక వేత్త, రచయిత కత్తి పద్మారావు వీల్ చెయిర్‌లో ఉండి హాజరయ్యారు. అవార్డు అందుకోవడానికి వచ్చిన కత్తి పద్మారావు తెగ ఇబ్బంది పడ్డారు. ఆయన వీల్ చెయిర్ కదలకపోవడంతో వాటి పెడల్స్‌ను సీఎం జగన్ స్వయంగా సరిచేశారు. సీఎం అంతటివాడు అంత శ్రద్ధ చూపడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.