Site icon NTV Telugu

సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత..

‘సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని.. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్, డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించిన ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సీతారామశాస్త్రిని వెంటనే కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.. ఆయనకు కిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది..

మరోవైపు.. సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.. ఆ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.. న్యుమోనియా తోనే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు.. అయితే తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు తెలిపారు.

Exit mobile version