Site icon NTV Telugu

Bus Accident: మహారాష్ట్రలో బస్సు ప్రమాదం.. 14 మందికి గాయాలు

Bus Accident

Bus Accident

మహారాష్ట్రంలో ఓ బస్సులో ప్రమాదానికి గురయింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈరోజు జరిగిన శివషాహి బస్సు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నగరంలో గత కొన్ని రోజులుగా శివషాహి బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలోని బాబా పెట్రోల్ పంపు వద్ద శివషాహి బస్సు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా 14 మంది గాయపడ్డారు.
Also Read: Kodali Nani: ఏం చేశావు బాబు..? నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా నేను, జూ.ఎన్టీఆరే..

ఈ ప్రమాదంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఘాటి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ శివషాహి బస్సు నాసిక్ కి చెందినదిగా గుర్తించారు. ఛత్రపతి సంభాజీనగర్ బస్ స్టేషన్ నుండి బయలుదేరిన తరువాత, బాబా పెట్రోల్ పంప్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు కంటైనర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Exit mobile version