Site icon NTV Telugu

శిల్ప కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

శిల్ప కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిట్టి పార్టీల కోసం దివానోస్‌ క్లబ్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. దివానోస్ క్లబ్‌లో 90 మందిని చేర్చారు. పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎర వేశారు. ఆమె ఆఫర్లను నమ్మి బ్లాక్‌ మనీని శిల్ప చేతిలో పెట్టారు కొందరు వ్యాపారవేత్తలు.

మరోవైపు…శిల్ప కేసులో మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. షామీర్‌పేటకు చెందిన చంద్ర మల్లారెడ్డి, ప్రతాప్‌రెడ్డి పేర్లను విచారణలో వెల్లడించారు. మల్లారెడ్డి ప్రతాప్‌రెడ్డికి తాను డబ్బు ఇచ్చానన్నారు. ఐతే…శిల్పను మరోసారి కస్టడీకి తీసుకొని… విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక…విచారణలో పోలీసులను శిల్ప ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. శిల్పకు పెద్ద మొత్తంలో వడ్డీలకు ఇచ్చాడు ఫ్లోరిస్ట్‌. అధిక వడ్డీకి ఆశపడి…నల్లధనాన్ని శిల్ప చేతుల్లో పెట్టాడు ఫ్లోరిస్ట్‌. ఐతే విచారణలో మాత్రం శిల్ప…ఫ్లోరిస్ట్‌కు తానే కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు.

Exit mobile version